![]() |
![]() |
.webp)
సర్కార్ సీజన్ 3 లాస్ట్ వీక్ ఎపిసోడ్ ఫుల్ న్యూసెన్స్ క్రియేట్ చేసింది. రీల్ వెర్సెస్ రియల్ న్యూస్ రీడర్స్ తో ఈ షోలో గేమ్స్ ఆడించాడు హోస్ట్ ప్రదీప్. న్యూసెన్స్ మూవీ నుంచి నవదీప్, బిందుమాధవి రాగా ఫేమస్ న్యూస్ రీడర్స్ ప్రత్యూష, సత్య యాళ్ల వచ్చారు. ఇక ఇందులో అడిగిన ప్రశ్నలకు బిడ్డింగ్ చేసుకుంటూ వెళ్లారు. ఐతే ఇందులో ఒక వెరైటీ టాస్క్ ఇచ్చాడు ప్రదీప్.. "గున్నా గున్నా మామిడి" అనే సాంగ్ ని న్యూస్ వెర్షన్ లో చదవాలని చెప్పాడు. "గున్న గున్న మామిడి...పిల్ల రావే గున్న మామిడి తోటకు అంటున్న ప్రదీప్..ఇంతకు ఎవరిని రమ్మంటున్నాడు" అని ప్రత్యూష
అనేసరికి "అమ్మబాబోయ్" అన్నాడు. " పెళ్లి అనగానే 11 వ ప్రశ్న అన్న ప్రదీప్ ఇక్కడ అలాంటి పాటలు ఎలా పెడుతున్నాడు..మనసులో లేకుండా ఇలాంటి పాటలు ఎలా వస్తున్నాయి..జల్దీగా రావే సంధ్య..రావే ఏమిటి" అని ప్రత్యూష అడిగేసరికి "రావే అనేది వాళ్ళ ఇంటి పేరు" మేడం అని చెప్పాడు. "మనం కలుసుకునే చోటికే అన్నారు...పబ్లిక్ గా ఎందుకు చెప్పడం మీరు ఫోన్ చేసుకుని చెప్పుకోవచ్చు కదా" అని అడిగింది. " అది కోడ్ వర్డ్ అంది..మేము గుడి దగ్గర అన్నదానాలు ప్లాన్ చేసాం. ప్రతీ వారం అక్కడే కలుసుకుంటాం ఆమె దద్దోజనం తీసుకుని, నేను పులిహోర తీసుకుని వెళ్తాం" అని ఫన్నీగా చెప్పాడు ప్రదీప్. ఇలా ఆ పాటను న్యూస్ లా చదివి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు.
![]() |
![]() |